Hyderabad: పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గరావుపై సస్పెండ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై వేటు పడింది. బీపీ డౌన్ కారణంగా ఇన్‌స్పెక్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసులో డీసీపీ వెస్ట్ జోన్ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో ఇన్‌స్పెక్టర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ కేసులోదుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన డిసిపి వెస్ట్ జోన్ ఆయనను సస్పెండ్ చేసింది. కాగా ఈనెల 24న అర్థరాత్రి అప్పటి బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సోహైల్ రాజ్ భవన్ ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు.
అతివేగంతో దూసుకొచ్చి ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కొడుకు అరెస్టుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే తన కొడుకును ఈ కేసును తప్పించే ప్రయత్నం చేశారు. ఇందుకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దర్గరావు ఆయనకు సహాకరించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్యే కొడుకు స్థానంలో మరో వ్యక్తిని నిందితుడిగా చిత్రీకరిస్తూ కేసు నమోదు చేశారు. దీంతో ఈ యాక్సిడెంట్ వ్యవహారం రాజకీయాలకు దారితీస్తుండటంతో సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో ఇన్‌స్పెక్టర్ దుర్గరావు వ్యవహరం బట్టబయలైంది. ఈ కేసులో ఏ1గా సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.