కరోనా నేపథ్యంలో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టుతుండడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను పునఃప్రారంభించాయి. అయితే కరోనా నిబంధనలను మాత్రం కట్టుదిట్టంగా అమలు చేస్తూ.. విద్యాసంస్థలు నిర్వహించాలని ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కరోనా సెలవుల్లో జరగాల్సిన పరీక్షలు, పరీక్షా ఫీజు చెల్లింపులల్లో గందరగోళం నెలకొంది. దీంతో తాజా యూజీ 1, 3…
ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాల డిగ్రీ ఫీజుల జీవో రద్దు చేసింది ఏపీ హైకోర్టు. ఫీజుల సిఫార్సు అంశంలో ఏపీ ఉన్నత విద్యా కమిషన్ తీరును తప్పుబట్టింది హైకోర్టు. అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫీజుల అంశంలో చట్ట నిబంధనలు పాటించకపోవడాన్ని తప్పుపట్టిన హైకోర్టు..వ్యక్తిగతంగా కానీ, నేరుగా కానీ కళాశాలల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా సొంత రుసుములను కమీషన్ సిఫార్సు చట్టఉల్లంఘనే అని పేర్కొంది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఫీజులు…