Praja Sangrama Yatra: నేటితో 6వ రోజుకు చేరిన బండి సంజయ్ పాదయాత్ర.. రాత్రి బస అక్కడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praja Sangrama Yatra: బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో, ఆఒక్కరోజు యాత్ర వాయిదా వేసుకున్నారు బండి సంజయ్. నిన్న విమోచన వేడుకలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో నేటితో బండి సంజయ్ పాదయాత్ర 6వ రోజుకు చేరుకుంది. మల్కాజ్ గిరి నుంచి ఈపాదయాత్ర ప్రారంభమైంది. బండి సంజయ్ పాదయాత్ర లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జ్ అరవింద్ మీనన్ కూడా వున్నారు. అనంతరం మల్కాజిగిరి చొరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించనున్నారు. మల్కాజ్గిరి క్రాస్ రోడ్డు నుంచి ఎల్ కె హాస్పిటల్ రోడ్, జేఎన్ టీ పాయింట్, ఆనంద్ బాగ్ క్రాస్ రోడ్స్, సఫిల్గుడా క్రాస్ రోడ్స్, వినాయక నగర్ క్రాస్ రోడ్డు, నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్, సాయిబాబా మందిరం రోడ్స్, యాప్రాల్ క్రాస్ రోడ్స్ మీదుగా డిఎన్ఆర్ గార్డెన్స్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ డిఎన్ఆర్ గార్డెన్స్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. ఈరోజు మొత్తం 10.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.
ప్రజా సంగ్రామ యాత్రంలో భాగంగా.. మొత్తం 115.3 కిలోమీటర్ల మేర బండి సంజయ్ నడవనున్నారు. యాత్రలో దారిపొడవునా ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. బండి సంజయ్ ఇప్పటి వరకు మూడు విడుతల్లో 11 వందల 28 కి.మీ. మే పాదయాత్ర చేశారు. అయితే.. మొత్తం 18 జిల్లాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు బండిసంజయ్. నాలుగో విడుత యాత్రతో కలిపి మొత్తం 8 పార్లమెంట్ నియోజకవర్గాలతో 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తీ కానుంది. బండి పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు సగటున 11 కి.మీ. మేర యాత్రను సాగించనున్నారు. అయితే గతంలో రోజుకు సుమారు 15 కి.మీ. పైగా నడిచారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో బండిసంజయ్ ఈయాత్ర చేపడతున్నారు. ఈ మహానగరంలో సమస్యలు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలను కలిసి, వారి సమస్యలను తెలుసుకుంటూ బండి సంజయ్ 10 నుంచి 11 కి.మీ. కుదించుకున్నారు. ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో, ఆఒక్కరోజు యాత్ర వాయిదా వేసుకుంటున్నారు. ఈనెల 22న పెద్ద అంబర్పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద.. పాదయాత్రను బండి సంజయ్ ముగించనున్నారు. బండిసంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక బహిరంగ సభకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Ambati Rambabu : పోలవరం నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గేది లేదు
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
తాజావార్తలు
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!