Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
- ఖైరతాబాద్ గణేశుడి కర్రపూజ ఘనంగా
- 70 అడుగుల పంచముఖ సంకట హార మహా గణపతి
- సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత ప్రత్యేక ఆకర్షణ
- 82 రోజుల్లో విగ్రహ నిర్మాణం పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khairatabad Ganesh : హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గురువారం సాంప్రదాయబద్ధంగా కర్ర పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ ఏడాది కొలువుదీరనున్న వినాయకుడి నమూనా పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. రాబోయే వినాయక చవితి పండుగ నాటికి, అంటే కేవలం 82 రోజుల్లోనే అన్ని హంగులతో కూడిన 70 అడుగుల భారీ మహా గణపతి విగ్రహాన్ని పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు సమసిపోయి, శాంతి చేకూరాలనే సంకల్పంతో ఈ సారి ఖైరతాబాద్ గణేశుడిని “పంచముఖ సంకట హార మహా గణపతి” రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ భారీ విగ్రహానికి కుడి వైపున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగం రూపాన్ని, ఎడమ వైపున భక్తులను రక్షించే కాళికామాత విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. లోకకల్యాణార్థం కొలువుదీరనున్న ఈ పంచముఖ గణపతి విశేష రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!