Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranabaali : కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ చుట్టూ పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ ఏకంగా ఏడు కారవాన్లు, 50 మంది అసిస్టెంట్స్ కావాలని డిమాండ్ చేశారని, దీనిపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారని, అంతేకాదు ఈ వ్యవహారం నిర్మాతల మండలి వరకు వెళ్లిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం అభిమానుల్లోనూ చర్చకు దారితీసింది. అయితే ఈ వార్తలపై ఇప్పుడు చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవిశంకర్ స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా నిరాధారమైన ఊహాగానాలేనని ఆయన తేల్చి చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, బయట ప్రచారంలో ఉన్నవి వట్టి పుకార్లని ఆయన చెప్పుకొచ్చారు.
విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఎప్పుడూ తన పనిపట్ల నిబద్ధతతో ఉండే నటుడని, సెట్స్‌లో పూర్తి ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తాడని, షూటింగ్ విషయంలో క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తిగా ఆయనను ప్రశంసించారు. దీంతో గత కొన్ని రోజులుగా వినిపించిన వివాదాస్పద ప్రచారాలకు చెక్ పడినట్లయింది. ‘రణబాలి’ ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నిర్మాత ఇచ్చిన వివరణతో ఇప్పుడు సినిమా చుట్టూ వినిపించిన గాసిప్‌లకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Tags
- cinema
- Vijay Deverakonda
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!