OTR: తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలో లుకలుకలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలపై తెలంగాణ ఎంప్లాయిస్ గుర్రుగా ఉన్నారా? సమస్యల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నది ఉద్యోగుల అభిప్రాయమా? వాళ్ళు రాజకీయ పదవుల కోసం వెంపర్లాడుతున్నారు తప్ప… మాకు మంచి చేసే ఉద్దేశ్యం లేదన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు సంఘాల నేతల వైఖరి మీద ఉద్యోగులకు ఏ పాయింట్లో డౌట్ కొట్టింది?
సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందంటూ కోపంగా ఉన్నారు తెలంగాణ ఉద్యోగులు.ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఇటీవల ఉద్యోగుల జేఏసీ చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. అయితే… బహిరంగ సభను వాయిదా చేసుకునేలా ప్రభుత్వం కల్పించుకుని జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలో.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై పోరాడేందుకు ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో అంతర్గత కుమ్ములాటలు తార స్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read
చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు సన్నద్ధం అయ్యారు. కానీ… ప్రభుత్వం చర్చలకు పిలవడంతో బహిరంగ సభను వాయిదా వేసింది జేఏసీ. ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఎలా విరమిస్తారంటూ ఓ వర్గం ప్రశ్నించడంతో ఐక్య కార్యాచరణ సమితిలో అభిప్రాయబేధాలు వచ్చాయట. చలో హైదరాబాద్‌ని వాయిదా వేయాల్సింది కాదని, 2022లో ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడను ముట్టడించిన తరహాలో హైదరాబాద్‌ను ముట్టడించి ఉండాల్సిందని జేఏసీలోని పలువురు నేతలు అభిప్రాయపడ్డారట. సభ కోసం సరూర్‌నగర్ స్టేడియానికి బదులు ఇండోర్ స్టేడియానికి అనుమతి ఎలా కోరుతారని మరో నేత ప్రశ్నించినట్టు తెలిసింది. జేఏసీ నాయకత్వం మెజార్టీ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా నడుస్తోందంటూ మరో నేత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల నాలుగు కీలక డిమాండ్ల పరిష్కారానికి జేఏసీ ఈ నెల 10న చలో హైదరాబాద్ కు పిలుపు ఇచ్చింది. కానీ… 9న సీఎస్ లిఖితపూర్వక హామీతో… కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అలాగే… 10న జేఏసీ నాయకత్వం ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్‌తో అసెంబ్లీలో వేర్వేరుగా భేటీ అయ్యింది.
ఆ సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం పోటీ పడ్డారు తప్ప సమస్యల మీద ఫోకస్ పెట్టలేదని కొందరు జేఏసీ నాయకులు కోపంగా ఉన్నట్టు తెలిసింది. అలాగే.. జేఏసీలోని కొందరు నేతలు సీఎంను ప్రత్యేకంగా కలవడం వివాదాస్పదం అయ్యింది. దీనిపై కొన్ని భాగస్వామ్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పలు వాట్సాప్ గ్రూపుల్లో ఇది వార్‌కు దారితీసింది. 206 సంఘాలతో పటిష్టంగా ఉన్న జేఏసీ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపేలా కొన్ని సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చక్కర్లు కొడుతుండటంపై జేఏసీ నాయకత్వం స్పందించింది. చైర్మన్, సెక్రటరీ జనరల్ స్థాయిని తగ్గించేలా, మేమే సాధిస్తాం అన్న రీతిలో ప్రచారం చేయడం ఐక్య ఉద్యమానికి నష్టం చేస్తుందని మండిపడింది ఐక్య కార్యాచరణ కమిటీ. సీఎం, స్పీకర్‌తో భేటీలో ఏ ఒక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రమేయం లేదని స్పష్టంచేసింది. జేఏసీలో భాగస్వామ్య సంఘాలుగా ఉంటూనే ఇలాంటి ప్రచారానికి పాల్పడటం తగదని సూచించింది.
అయితే ఉద్యోగ సంఘం నేతలు రాజకీయ పదవుల ఆశతో, రాజకీయ పార్టీల ప్రమేయంతో, పార్టీల సూచనల మేరకు ఉద్యమాలు నిర్వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఎంప్లాయిస్. సీఎంతో భేటీ అనంతరం… సర్కార్ మూడు డీఏల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయి. కానీ…రెండు డీఏలకు ఆమోదమంటూ కొన్ని సంఘాలు వైరల్ చేశాయి. ఫైనల్‌గా ఇదంతా ఉత్తుత్తిదేనని తేలింది. ఒక వైపు డీఏలంటూ ప్రచారం కావడం.. సర్కార్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఉద్యోగుల జేఏసీకి సంకట స్థితి ఎదురయ్యింది. దీంతో… సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా ఆయా సంఘాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయకత్వం చెబుతోంది.
ఇష్టంలేని వారు జేఏసీ నుంచి వెళ్లిపోవచ్చంటూ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఉద్యమానికి పిలుపునిచ్చినా ఎవరూ నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చారంటూ మరో నేత ఫైర్ అయ్యారు. ప్రభుత్వం సమయమిచ్చిన తర్వాత.. సీఎం, స్పీకర్, పీఆర్సీ కమిటీ చైర్మన్, సీఎస్‌ను జేఏసీ నాయకత్వం విడిగా కలవాల్సిన అవసరమేముందని మరో నేత ఫైర్ అయ్యారు. చలో హైదరాబాద్ అంటూ తొడగొట్టిన వారు.. ఇప్పుడు సర్కార్ చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారన్నది మరో ఉద్యోగ సంఘం నేత క్వశ్చన్. మొత్తం మీద సమస్య పరిష్కారం అవకపోగా….సంఘాల నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి ఉద్యమమే ప్రశ్నార్ధకమైందన్నది ఉద్యోగుల ఆవేదనగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!