జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లా, గురువారం తెల్లవారుజాము. నాదర్, ట్రాల్ ప్రాంతం. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ ద్వారా ముగ్గురు ఉగ్రవాదుల కదలికలను ఓ ఇంట్లో గమనించారు.
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు త్రాల్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది.
జైషే మహమ్మద్ అధినేత, మసూద్ అజార్ ఫ్యామిలీలోని 14 మంది ఈ దాడుల్లో చనిపోయారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయాల నష్టపరిహారం అందజేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మసూద్ అజార్‌కు నష్ట పరిహారం కింద సుమారు రూ. 14 కోట్లు దక్కే ఛాన్స్ ఉంది.
Terrorist: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి విచారణలో కుల్గాంకు చెందిన ఇంతియాజ్ మహ్మద్ లష్కరే తోయిబా స్లీపర్ సెల్ సభ్యుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఉగ్ర దాడికి సంబంధించి జరిపిన దర్యాప్తులో ఇంతియాజ్ పాత్ర బయటపడిందని అన్నారు.
అయోధ్య రామమందిరంపై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన రెహ్మాన్(17)ను హర్యానా-గుజరాత్ పోలీసుల బృందం అరెస్ట్ చేశారు. రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లతో రామమందిరాన్ని పేల్చాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రమేయం ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వూర్ రాణాను త్వరలో భారత్‌కు అప్పగించవచ్చు. రాణాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ దౌత్య మార్గాల్లో సాగుతోంది. 2024 ఆగస్ట్‌లో.. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం.. రాణాను భారత్‌కు అప్పగించవచ్చని యూఎస్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే భారత్‌కు తీసుకొచ్చి.. ఉరిశిక్ష…
Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత, బంగ్లాదేశ్‌లో కోలువు తీరిన మహ్మద్ యూనస్ సర్కార్ భారత వ్యతిరేక చర్యల్ని ప్రోత్సహిస్తోంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు హిందువుల, ఇతర మైనారిటీలు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. ఇదే కాకుండా జమాతే ఇస్లామీ, బీఎన్‌పీ పార్టీకి చెందిన పలువురు వివాదాస్పద నేతల్ని జైళ్ల నుంచి విడుదల చేస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా భారత్ అంటేనే ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటాయి. పలువురు ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ అనుకూల,…
భారత దర్యాప్తు సంస్థలు గొప్ప విజయాన్ని సాధించాయి. మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాలోని రువాండాలో అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేసి భారత్‌కు తీసుకువస్తున్నారు. భారత ఏజెన్సీలు ఉగ్రవాదికి సంబంధించి రువాండాకు సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఖచ్చితమైన సమాచారం అందించాయి. దాని ఆధారంగా అతన్ని రువాండా పోలీసుల సిబ్బంది అరెస్టు చేశారు.
కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో సొరంగం నిర్మాణ సంస్థ క్యాంప్‌సైట్‌పై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు.
IC 814 హైజాక్ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సిరీస్ లో టెర్రరిస్టుల పేర్లపై వివాదం కొనసాగింది. కాగా.. దీనికి సంబంధించిన తాజా వార్త చక్కర్లు కొడుతోంది. చండీగఢ్‌లోని మణిమజ్రాకు చెందిన పూజా కటారియా తన భర్తతో కలిసి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు.