Vikarabad incident: వికారాబాద్ జిల్లా యాలాలా మండలం అగ్గనూరు జిల్లా పరిషత్ పాఠశాల కు చెందిన మైనర్ బాలిక పై లైంగిక దాడి తీవ్ర కలకలం రేపింది. లైంగిక దాడికి పాల్పడిన రఘుపతిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
అసలు ఏం జరిగింది..
వికారాబాద్ జిల్లా యాలాలా మండలం అగ్గనూరు జిల్లా పరిషత్ పాఠశాల కు చెందిన మొత్తం 89 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు 2 బస్సుల్లో తీసుకెళ్ళారు. ఈ నెల 13 న విహారయాత్రకు వెళ్ళి 14 వ తేది ఉదయం మూడు గంటల సమయంలో విద్యార్థులు వచ్చారు. స్కూల్ దగ్గరికి వచ్చే సరికి ఆలస్యం కావడంతో పేరెంట్స్ కు పిల్లలను తీసుకెళ్ళమని చెప్పిన ఉపాధ్యాయులు. అయితే.. పేరెంట్స్ రాకపోవడంతో రఘుపతి అనే యువకుడిని టీచర్స్ విద్యార్థులను వారి వారి ఇంటి వద్దకు దింపాలని కోరారు. దీంతో రఘుపతి సరే అని మొత్తం నలుగురు విద్యార్థులను రఘుపతి కారులో తీసుకెళ్ళాడు. అయితే విద్యార్థల్లో ఒక మైనర్ బాలికపై కన్నేసాడు రఘుపతి. అమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. మొత్తం నలుగురిలో ముగ్గరిని ముందుగానే దింపేస్తే ఇక ఆ మైనర్ బాలిక మాత్రమే ఉంటుందని భావించాడు. తను వేసుకున్న పథకం ప్రకారమే ముగ్గురు విద్యార్థులను వీరశెట్టిపల్లిలో దింపేసిన రఘుపతి.
మరో విద్యార్థినిని పెర్కంపల్లి తండలో దింపాల్సి ఉండగా.. ఆమైనర్ బాలిక తెల్లవారు ఝామున కావడంతో కాస్త నిద్రమత్తులో ఉండటం గమనించాడు. కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు అయితే దీంతో తేరుకున్న ఆబాలిక ఎక్కడి అంటూ కేకలు వేసింది. రాఘుపతి ఆ బాలికను బెదిరించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఏమీ తెలియనట్లు ఇంట్లో వదిలి వెళ్లిపోయాడు. అయితే.. ఈఘటన జరిగిన వారం రోజుల తరువాత యాలాల పీఎస్ లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో భాగ్యనగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఎన్టీవీ ఎఫెక్ట్..
యాలాల ఘటన పై ఎన్టీవీలో ప్రసారం చేయడం జరిగింది. దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. యాలాల మండలం అగ్గనూరు పాఠశాల టెన్త్ విద్యార్థి పై లైంగిక దాడి ఘటన పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పేరెంట్స్ కు అప్పగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్స్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ ఎంట్రీతో.. హెడ్మాస్టర్ తో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. విహారయాత్ర నుండి వచ్చిన విద్యార్థులలో నలుగురు విద్యార్థులను పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారు. అయితే.. మిగతా విద్యార్థులను సేఫ్ గా దింపాలని పెర్కంపల్లి గ్రామానికి చెందిన రఘుపతిని, టీచర్స్ కోరారు. అయితే మైనర్ విధ్యార్థిని పై లైంగిక దాడికి దిగి పేరెంట్స్ కు అప్పగించిన రఘుపతిపై కలెక్టర్ వేటు వేయడంతో పాఠశాల సహా రఘుపతి పై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. పాఠశాలకు వెళ్లాలంటేనే విద్యా్ర్థులు భయాందోళన చెందుతున్నారు.
Read also: Lakshman Fruite: లక్ష్మణ ఫలం.. పవర్ తెలిస్తే అస్సలు వదలరండోయ్
అయితే యాలాల ఘటపై కేవిపిఎస్, లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు మండిపడ్డారు. నగరాల్లో ఇలాంటి ఘటనలు జరిగేవి.. ఇప్పుడు గ్రామాలు వరకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండాల నుండి ఇప్పుడిప్పుడే చదువుకోవడానికి బాలికలను పంపిస్తున్నారని, ఇలాంటి ఘటనలు జరిగితే పంపియడానికి భయపడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి వెంట పంపిస్తే ఇంత దారుణానికి ఒడిగడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.
Nabha Natesh: నభా.. నువ్వలా మత్తుగా చూస్తుంటే, గుండెల్లో పెరుగుతోంది దడ