వేసవికాలం వచ్చేసింది. వేడి దాటిని తట్టుకునేందుకు ఎన్నో రకాలైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగే ఈ వేసవికాలం పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది.
పండ్లలో పుచ్చకాయ, ఖర్బూజ వంటివి ఎక్కువ నీటి శాతంతో పాటు ప్రొటీన్లను కలిగి ఉంటాయి. మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలు. కేవలం వేసవిలో మాత్రమే లభిస్తాయి.
పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకుపోయి, మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది.
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల డీహైడ్రేషన్ బారిన పడతాం. తాటి ముంజలను తీసుకుంటే శరీరంలోకి ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు.