చాలా తక్కువ మందికి తెలిసిన పండ్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి లక్ష్మణఫలం.. దీనినే హనుమాన్ ఫలం అని కూడా అనిపిలుస్తారు. మన దేశంతోపాటు బ్రెజిల్‌లోనూ ఈ పండు ఎక్కువగా పండుతుంది.
లక్ష్మణఫలానికి 12 రకాలకు పైగా క్యాన్సర్లను తగ్గించే శక్తి ఉంది. పెద్దపేగు, బ్రెస్ట్, ప్రోస్టేట్, లంగ్, పాంక్రియాటిక్ వంటి క్యాన్సర్లను,శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేసే ఔషధ గుణాలు ఈ పండులో ఉంటాయి.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఈ పండును తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఆ ఇన్‌ఫెక్షన్లను రాకుండా చూస్తుంది.
లక్ష్మణ ఫలంలో కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ సమస్య నుంచి ఉపశమనం.. నొప్పులు తగ్గుతాయి.
లక్ష్మణ ఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.
శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గితే కాళ్లు పట్టుకుపోతుంటాయి. కానీ లక్ష్మణ ఫలంలో కాల్షియం, మెగ్నిషియం, సోడియం, పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
శరీరంలో ద్రవాలు కొందరికి ఎక్కువగా చేరుతుంటాయి. అలాంటి వారు లక్ష్మణ ఫలం తింటే మంచిది. దీంతో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వాపులు తగ్గుతాయి.
బాగా అలసిపోయినవారు లక్ష్మణ ఫలం తింటే వెంటనే శక్తిని పుంజుకుంటారు. ఈ పండులో బి విటమిన్లు ఉంటాయి. ఇవి శక్తి ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో శక్తి బాగా లభించి యాక్టివ్‌గా మారుతారు.
లక్ష్మణ ఫలంలో ఉండే మెగ్నిషియం, మాంగనీస్, కాపర్, జింక్‌లు ఎముకలను దృఢంగా మారుస్తాయి. శరీరం విటమిన్ డిని తయారు చేసేలా చూస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి.
లక్ష్మణ ఫలంలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది చక్కని నిద్ర వచ్చేందుకు దోహదపడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ పండును తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే బీపీ అదుపులో ఉంటుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నవారు ఈ పండును తినాలి. దీంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నోట్లో పుండ్లు, పొక్కులు ఉన్నవారు లక్ష్మణ ఫలాన్ని పేస్ట్ చేసి ఆయా భాగాలపై రాయాలి. దీంతో పుండ్లు మానుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు లక్ష్మణ ఫలాన్ని తినాలి. ఇందులో రైబోఫ్లేవిన్ ఉంటుంది. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది.