CLP Meeting: నేడు సీఎల్పీ సమావేశం.. రేపు అభిషేక్ సింఘ్వీ నామినేషన్..
- నానక్‌రామ్ గూడలో రాత్రి 7 గంటలకు సీఎల్పీ సమావేశం..
- రాజ్యసభ అభ్యర్థిని ఎమ్మెల్యేలకు పరిచయం చేయడం కోసం సీఎల్పీ భేటీ..
- రేపు నామినేషన్ దాఖలు చేయనున్న అభిషేక్ సింఘ్వీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CLP Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటన్‌లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆహ్వానించారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. సీఎల్పీ సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సింఘ్వీ పార్టీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కోరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
Read also: Kaleshwaram Project: నేటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ విచారణ..
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె.కేశరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించడమే సీఎల్ ఎఫ్ సమావేశంలో ప్రధాన ఎజెండా. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చిస్తారని తెలిసింది. అలాగే, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీ భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన సింఘ్వీ.. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఉన్నారు.
Kolkata Doctor Case: ఆందోళనకు ఐఎంఏ పిలుపు.. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా..
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!