తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. మొన్నటికిమొన్న సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి.. బీజేపీ కండువా కప్పుకోగా.. ఇవాళ.. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ కమలం పార్టీ గూటికి చేరారు.. అదెల్లి పోచమ్మ గుడి వద్ద బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అయిటే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రామారావ్ పటేల్…ఇక, ఆయనతో పాటు జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలు సైతం రాజీనామాలు చేసిన విషయం విదితమే.. ఇప్పటికే తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్‌తో సమావేశమై చర్చించారు.. ఆ సమావేశం తర్వాతే.. బీజేపీలో చేరుతున్నట్లు రామారావు పటేల్ ప్రకటించారు.
Read Also: Bandi Sanjay: రాజకీయ సమీకరణాలు మారతాయి.. పాదయాత్రతో కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్..!