NIMS: మన సమాజంలో అత్యంత బాధ కలిగించే నిజం ఏమిటంటే, పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో చిన్నారులు బాధపడటం. ఆర్థికంగా బలమైన కుటుంబాలు పెద్ద ఆసుపత్రుల్లో ఆధునిక చికిత్స పొందగలిగినా, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రాణాలను కాపాడటానికి ఆర్థిక సహాయం కోసం ఇతరులను వేడుకోవాల్సి వస్తోంది.
OG : ఓజీ స్టోరీ ఇదేనట.. కథలో ఇంత డెప్త్ ఉందా..
ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు నిమ్స్‌లో ప్రత్యేక శిబిరం నిర్వహించబడుతుంది. బ్రిటన్ వైద్యుల సహకారంతో ఈ శిబిరంలో చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ముందుగా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమైన వారికి తక్షణమే ఆపరేషన్లు చేస్తారని తెలిపారు.
ఈ శస్త్రచికిత్సలకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా భరిస్తోంది. అంటే తల్లిదండ్రులకు ఒక్క రూపాయి భారమూ పడదని నిమ్స్ అధికారులు హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ బీరప్ప వివరాల ప్రకారం, నిమ్స్ ఆసుపత్రి పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో డా. అమరేష్ రావు, డా. ప్రవీణ్, డా. గోపాల్ వంటి నిపుణ వైద్యులు పిల్లలను పరీక్షించనున్నారు. ప్రతి మంగళవారం, గురువారం, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పిల్లల తల్లిదండ్రులు అంతకుముందు తీసుకున్న రిపోర్టులు, సీటీస్కాన్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆసుపత్రి అధికారులు సూచించారు.