OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లకు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఇలాంటి టైమ్ లో ఓజీ స్టోరీ ఇదే అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఓజీ అంటే ఒజాస్ గంభీరా. పవర్ ఫుల్ పాత్రను పవన్ ఇందులో పోషిస్తున్నాడంట. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ది హై ఓల్టేజ్ ఫైర్ ఉండే పాత్ర అని తెలుస్తోంది. అండర్ వరల్డ్ మాఫియాకు డాన్ గా ఎదిగిన పవన్.. ఆ తర్వాత కొన్ని కారణాలతో దాని నుంచి తప్పుకుని అడ్రస్ లేకుండా పోతాడు. ఆ తర్వాత మాఫియా సామ్రాజ్యానికి కొత్త ప్రెసిడెంట్ అయ్యేందుకు ఒమి బాబు(ఇమ్రాన్ హష్మి) ప్రయత్నిస్తాడు.
Read Also : Spirit : ప్రభాస్ తండ్రిగా చిరంజీవి.. క్లారిటీ వచ్చేసింది
అతని అరాచకాలు ఎక్కువ కావడంతో పవన్ ఈ చీకటి సామ్రాజ్యానికి తిరిగి వస్తాడు. అప్పుడే అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని సమాచారం. పవన్ కల్యాణ్ చేసే యాక్షన్ సీన్లు ఫ్లాష్ బ్యాక్ లో బాగా ఉంటాయంట. అవి సినిమాకే హైలెట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక సెకండాఫ్ లో ఇమ్రాన్ హష్మీతో పవన్ చేసే యాక్షన్ సీన్లు కట్టిపడేస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ కు ముందు బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ ఇస్తారంట. ఆ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఒమి బాబు అరాచకాలను ఎదుర్కునేందుకు పవన్ ఎలాంటి ప్లాన్లు వేశాడనేది సెకండాఫ్ లో కనిపిస్తుంది. క్లైమాక్స్ ఫ్యాన్స్ కు సంతృప్తి కలిగించేలా ప్లాన్ చేశాడంట సుజీత్. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. పవన్ ఫ్యాన్స్ ఈ స్టోరీలైన్స్ ను ఉదయం నుంచి తెగ వైరల్ చేస్తున్నారు.
Read Also : RGV – Sandeep Reddy : ఆర్జీవీ ఒక సైతాన్.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్