New Year 2026 Permissions: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ 2026 వేడుకలు నిర్వహించాలని భావిస్తున్న హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లు, రిసార్ట్‌లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా పొందాల్సిందిగా పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ నైట్ వేడుకలకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఈ అనుమతుల కోసం డిసెంబర్ 21, 2025 వరకు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
అనుమతి కోసం దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిజికల్ అప్లికేషన్లు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇందుకోసం cybpms.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా అవసరమైన ఫారమ్‌లు పూరించాలి. టికెట్ విక్రయాలతో జరిగే న్యూ ఇయర్ ఈవెంట్లకు సంబంధించి కమర్షియల్ / టికెటెడ్ ఫారంను ఎంచుకోవాలి. అలాగే టికెట్లు లేకుండా జరిగే వేడుకల కోసం నాన్–కమర్షియల్ ఫారం అందుబాటులో ఉంటుంది. ఏ ఈవెంట్ నిర్వహించాలన్నా, దాని స్వరూపానికి అనుగుణంగా సరైన ఫారం ఎంపిక చేసి, అవసరమైన పత్రాలు జత చేయాలని పోలీసులు సూచించారు.
Ajay Devgn: హైదరాబాద్‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ ఫిల్మ్ సిటీ
డిసెంబర్ 21 తర్వాత సమర్పించే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోబోమని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ప్రజా శాంతి భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, రాత్రి వేళల్లో ప్రజల సురక్షితతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ సంబరాల్లో అనవసరమైన గందరగోళం, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ముందుగా పరిపాలనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సైబరాబాద్ పోలీసు అధికారులు చెప్పారు.
ఈసారి కూడా డ్రంకెన్ డ్రైవింగ్, చట్టవ్యతిరేక వేడుకలు, అనుమతి లేని పార్టీలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కనుక ఈవెంట్ నిర్వాహకులు, యజమానులు, సంస్థలు ముందస్తు అనుమతులు పొందడం, గైడ్‌లైన్స్‌ను పాటించడం తప్పనిసరి. న్యూ ఇయర్ 2026 వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు పోలీసులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
Zakiya Khanum: ఎమ్మెల్సీ రాజీనామాల విషయంలో ట్విస్ట్..! రాజీనామా ఉపసంహరణ..