Sarpach Sworn: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్‌ల ప్రమాణస్వీకార వేడుకల తేదీని ప్రభుత్వం మార్పు చేసింది. మునుపటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమం, ఇప్పుడు డిసెంబర్ 22వ తేదీకి వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవడానికి, ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా తేదీని పొడిగించాలని అభ్యర్థనలు రావడంతో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రెండు రోజులు ముందుకు జరిపింది.
Saif Ali Khan : షారుఖ్-సల్మాన్ బాటలో నడవాలనుకోవడం లేదు.. సైఫ్ షాకింగ్ డిసిషన్
మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈ నెల 22న అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే రోజున గ్రామ సభలు నిర్వహించి, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో కలిసి ఉప సర్పంచ్‌లను కూడా ఎన్నుకోనున్నారు. ఈ మార్పుతో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 22వ తేదీన కొత్త పాలకవర్గాలు పూర్తిస్థాయిలో కొలువుదీరనున్నాయి.