Varanasi : వారణాసి 2 పార్ట్స్.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి మరియు మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓ హాలీవుడ్ మీడియాతో వారణాసి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా కథ, కథనం, రన్ టైమ్ తో పాటు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
రాజమౌళి మాట్లాడుతూ, “నా ప్రతి సినిమాలోనూ రామాయణం, మహాభారతం యొక్క స్ఫూర్తి ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో అది కేవలం స్ఫూర్తి మాత్రమే కాదు. మేము రామాయణంలోని ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాము. వారణాసి కేవలం భారతీయ సంస్కృతి మరియు కథల గురించి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ ఎమోషన్స్‌తో సాగుతుంది. ‘RRR’ సినిమాను వరల్డ్ వైడ్ గా ఎలాగైతే ఆదరించిందో, ఈ చిత్రాన్ని కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
Also Read : Mahesh Babu : ‘పోకిరి’ నా జీవితాన్ని మార్చేసింది.. మళ్ళీ ‘వారణాసి’ తో అదే జరగబోతుంది
ఆలాగే వారణాసి టూ పార్ట్స్ పై జక్కన్న స్పందిస్తూ ‘కథ చాలా పెద్దది కావడంతో, ఒక దశలో మేము ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఆలోచించాము. కానీ త్వరగానే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాము. ప్రస్తుతానికి ఈ సినిమా ఒకే పార్ట్‌గా రాబోతోంది. సినిమా నిడివి సుమారు 3 గంటల వరకు ఉంటుంది. ఈ మూడు గంటల ప్రయాణం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది” అని రాజమౌళి వెల్లడించారు. వారణాసి నేపథ్యంగా సాగే ఈ కథలో భారతీయ మూలాలు బలంగా కనిపిస్తాయని, అదే సమయంలో హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఉంటుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?