Sri chaitanya college: సాత్విక్ ఆత్మహత్య.. శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri chaitanya college: నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల గుర్తింపును తెలంగాణ ఇంటర్ బోర్డు శాశ్వతంగా రద్దు చేసింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు విచారణలో కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం కమిటీని వేసింది. ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ వేధింపులు నిజమేనని కమిటీ తేల్చింది. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. సాత్విక్ మరణానికి కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నలుగురిని నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని తమను వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్ లో సాత్విక్ కోరాడు.
Read also: Kishan Reddy:రూ.200 మందులు కొని రూ.21 ఫోన్ పే చేసిన కేంద్రమంత్రి
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నివసిస్తున్న రాజప్రసాద్, అలివేలు దంపతుల చిన్న కుమారుడు సాత్విక్ శ్రీచైతన్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఇంటర్ చదువుతున్నాడు. కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాత్విక్ ఆత్మహత్యకు కాలేజీ లెక్చరర్ల వేధింపులే కారణమని సాత్విక్ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. తక్కువ మార్కులు వచ్చాయని లెక్చరర్లు వేధిస్తున్నారని సాత్విక్ చెప్పినట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే సాత్విక్ కుటుంబ సభ్యులు, ఇతర విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Minister KTR: మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానికి నిదర్శనం మీ స్పందనే
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!