Nandamuri Balakrishna: ఎన్టీఆర్ లాంటి నటుడు ప్రపంచం మొత్తం వెతికినా దొరకడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna:ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎన్టీఆర్ సొంత జిల్లాలో జరగడం సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తన తండ్రి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. “వందేళ్ల క్రితం ఓ వెలుగు పుట్టింది. ఆ వెలుగు మరో వేయ్యేళ్లు వెలుగుతుంది. తెలుగు వెలుగు ఎన్టీఆర్. దైవాంశ సంభూతుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తనయునిగా నేను పుట్టడం పూర్వ జన్మ సుకృతం. ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎన్టీఆర్ సొంత జిల్లాలో జరగడం సంతోషంగా ఉంది. ఆయన చేసిన సినిమాలు, నటించిన పాత్రలు.. లెక్కలేనివి, చెప్పలేనివి.
Rajinikanth: బాలకృష్ణ కంటిచూపుతోనే చంపేస్తాడు.. అది ఎవరి వలన కాదు
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ లాంటి నటుడు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కన్పించరు. ఎన్టీఆర్ నటనకు జీవం పోశారు.
నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేలా చేసింది ఎన్టీఆరే. ఇక ఒక పక్క సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్రను చూపించారు. తెలుగుదేశం పార్టీ పెట్టి పేదవారికి ఎలాంటి సేవ చేశారో అందరికి తెలుసు. రాజకీయాలంటే ఏంటో తెలియని వాళ్లకు కూడా రాజకీయ చైతన్యం కల్పించారు ఎన్టీఆర్. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని.. పాలనను తీసుకెళ్లిన మహానుభావుడు ఎన్టీఆర్. ఎన్ని పథకాలను ప్రజలకు అందించారు. అవన్నీ ఇప్పుడు ప్రజలకు వరంగా దొరికాయి” అని చెప్పుకొచ్చారు. ఇక అభిమానుల గురించి, చంద్రబాబు గురించి కూడా బాలయ్య మాట్లాడారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..