Vijay Deverakonda Reveals his Inspiration: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ నిర్వహించిన సినిమా యూనిట్ తాజాగా విజయ్ దేవరకొండ తో ఒక లైవ్ ఇంటరాక్షన్ సెక్షన్ నిర్వహించింది. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా వస్తున్న ప్రశ్నలకు విజయ్ దేవరకొండ లైవ్ లో సమాధానాలు ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు విజయ్ దేవరకొండ చెప్పిన సమాధానం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే తనకు ఎవరూ ఇన్స్పిరేషన్ లేరని నాకు కొన్ని విషయాలు కావాలని అదే తనకు అసలైన ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. మా అమ్మానాన్నని కంఫర్టబుల్గా చూడాలని కోరిక ఉంది, ఇంటి అద్దులు, గ్యాస్ సిలిండర్ వస్తే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? నెలాఖరు వస్తుంది, రెంట్ కట్టాలి, అకౌంట్ లో డబ్బులు లేవు.
Brahmanandam: తిరుమలలో బ్రహ్మానందం..సెల్ఫీ కోసం పోటీ పడటంతో?
పిల్లలకు ఫీజులు కట్టాలంటే డబ్బులు లేవు లాంటి టెన్షన్లు చూసి చూసి విరక్తి పుట్టేసింది. ఇకమీదట ఇలా ఉండొద్దు అని నేను ఫిక్స్ అయ్యాను, అలాగే నేను నా తల్లిదండ్రులను హ్యాపీగా ఉంచాలి అనుకున్నాను. నేను హ్యాపీగా ఉండి కంఫర్టబుల్గా ఉండాలని అనుకున్నాను. అలాగే నాకు ముఖ్యంగా రెస్పెక్ట్ కావాలి నన్ను నా ఫ్యామిలీ, నా చుట్టాలు, సొసైటీ అందరూ గౌరవించాలని అనుకున్నాను. అలా గౌరవించాలంటే నువ్వు ఏదో ఒకటి చేయాలి, ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు రెస్పెక్ట్ మాత్రమే నాకు ఇన్స్పిరేషన్ అని విజయ్ దేవరకొండ తేల్చి చెప్పాడు. తాను ఏదైనా రెండు విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చానంటే అది డబ్బు, రెస్పెక్ట్ కి మాత్రమేనని తనను ఎవరైనా అగౌరవపరిస్తే వాళ్లని క్షమించలేనని ఈ సందర్భంగా విజయ్ చెప్పుకొచ్చాడు. డబ్బు, రెస్పెక్ట్ కోసమే తాను పని చేశానని ఈ క్రమంలో విజయ్ చెప్పుకొచ్చాడు. నిజానికి అందరి ఫైనల్ టార్గెట్ డబ్బే అయినా డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ విజయ్ దేవరకొండ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం గమనార్హం.