రెండు మనసులను మూడు ముళ్ల బంధంతో ఏకం చేసే పవిత్ర బంధం పెళ్లి.. అందుకే మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది.. జీవితంలో ఒక్కసారి చేసుకొనే వేడుక అందుకే ఉన్నంతలో ఘనంగా చేసుకుంటారు.. పెళ్లి విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు.. అయితే ఈ మధ్యకాలంలో అబ్బాయిలు పెళ్లి విషయం రాగానే ఏదోకటి చెప్పి తప్పించుకుంటున్నారు.. పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.. అందుకు కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..
పెళ్ళి అంటేనే ఓ బాధ్యత. ముందుగా చెప్పుకున్నట్లుగా అందరు కూడా స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారు. అదనపు బాధ్యతలు వారు కోరుకోవడం లేదు. పెళ్ళి చేసుకుంటే వారి భుజాలపై అదనపు వచ్చి బాధ్యతలు వచ్చి పడతాయనే కారణంతోనే చాలా మంది అబ్బాయిలు పెళ్లి వద్దని ఫిక్స్ అవుతున్నారు.. అలాగే భార్య, భర్తలు ఇద్దరు కూడా ఒకరి అనుమతితో ఒకరు మెలగాల్సి ఉంటుంది. కానీ, నేడు చాలా మంది ఇండిపెండెంట్‌గా ఉండడానికి అలవాటు పడ్డారు.. అలాంటివి వద్దు అని భావిస్తుంటారు అందుకే ఇష్టం చూపించడం లేదు..
ఇకపోతే మ్యారేజ్ అయ్యాక ఖర్చులు పెరుగుతాయని. నేటి కాలంలో పెరిగిన ఖర్చులు, జాబ్ సెక్యూరిటీ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మ్యారేజ్ అయ్యాక ఫ్యామిలీని రన్ చేయలేమోనన్న భయం, గొడవలు చాలా వస్తాయని మగవారు పెళ్ళి అంటేనే భయపడుతున్నారు.. వారి చుట్టు పెళ్ళైన వాళ్లను చూసి పెళ్లి వద్దని అనుకుంటారు..మ్యారేజ్ అయ్యాక గొడవలు, విడిపోవడం వంటివి వారి జీవితంలోనూ వస్తాయని విడిపోయే అవకాశం ఉంటుందని భావించి పెళ్ళి అంటేనే భయపడిపోతారు మగవారు… ఇది కొందరికి మాత్రమే..