Home Guard Wife: నాకు న్యాయం జరగాలి.. అప్పటి వరకు పోస్టుమార్టానికి ఒప్పుకోను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Guard Wife: హోంగార్డు రవీందర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఉస్మానియాకు తరలించారు పోలీసులు. రవీందర్ భార్య సంధ్య కోసం ఎదురుచూసారు. సంధ్య రాగానే ఆమెతో సంతకం చేయించి రవీందర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులు చూస్తున్నారు. దీంతో ఉస్మానియా మార్చురి వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అధికారులకు హోంగార్డు భార్య సంధ్య షాక్ ఇచ్చింది. పోస్ట్ మార్టంకు ఒప్పుకోనని తెలిగేచి చెప్పింది. న్యాయం జరిగేంత వరకూ పోస్ట్ మార్టంకు ఒప్పుకోనని కన్నీరుమున్నీరయ్యింది. హోంగార్డు భార్య సంధ్యను ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల మాటలను పక్కనపెట్టి తనకు న్యాయం చేయాలని, అప్పటి వరకు సంతకం పెట్టను, పోస్ట్ మార్టం చేసేందుకు అనుమతి ఇవ్వనని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నా భర్త గత 17 ఏళ్లుగా ఎంతో సిన్సియర్గా డ్యూటీ నిర్వహించాడని కన్నీరుమున్నీరయ్యింది. నిజాయితీగా పని చేశాడు, నాకు నిబంధనలు ఉల్లంఘించానని ఫైన్ వేశాడని తెలిపారు.
Also Read
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
నా భర్త ఫోన్ మొత్తం అన్‌లాక్ చేసి డాటా మొత్తం డిలీట్ చేశారని మండిపడింది. నా భర్త రవీందర్ ఎంతో తెలివైన వాడని, నా భర్తతో నేను మాట్లాడిన తరువాతే చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్తను ఏఎస్‌ఐ నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందు లు పెట్రోల్ పోసి తగులబెట్టి చంపారని ఆరోపించారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదు? సీసీ కెమెరా ఫూటేజి ఎందుకు చూపించడం లేదు? అని ప్రశ్నించారు. నా భర్తను చంపిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. హమీద్ అనే అధికారి తన వద్దకు వచ్చాడని, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని సిగిరెట్ తాగుతుండగా ప్రమాదం జరిగిందని చెప్పమని బెదిరించారని సంధ్య వాపోయింది. అప్పుడే బెనిఫిట్ లు అన్ని వస్తాయని.. నన్ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని కన్నీరుమున్నీరయైంది.
TS Congress: 17న హైద్రాబాద్ లో కాంగ్రెస్ సభ.. సోనియా సమక్షంలో తుమ్మల, మైనంపల్లి చేరిక..?
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!