MP Komatireddy: ఏళ్లు గడుస్తున్నాయే గానీ హామీని నిలబెట్టుకోలేదని సీఎం కేసీఆర్ కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులకు కరెంట్ కోతలు విధించటం ఎరువుల ధరలు పెంచటం లాంటి పలు రైతాంగ సమస్యలను మీ దృష్టి కి ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. రైతు లేనిది రాజ్యం లేదు ఒక రైతు ఆరు నెలలు కష్టపడితేనే మనం అన్నం తింటాం నెలతల్లిని నమ్ముకుని కష్టపడి బ్రతికే రైతన్నలకు ప్రభుత్వాలు చేయుతనివ్వాలి కానీ వారికి భారంగా మారకూడదు. ఇప్పటికే వడ్లు కొనుగోలు విషయంలో…
దూకుడు రాజకీయాలకు రేవంత్ రెడ్డి పెట్టింది పేరు. ఆ వ్యక్తిత్వమే ఆయన్ను రాజకీయంగా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టింది. కాంగ్రెస్ లో ఎంతమంది హేమాహేమీలున్నా వారందరినీ కాదని కాంగ్రెస్ పార్టీ అతడికి టీపీసీసీ కట్టబెట్టింది. ప్రజల్లో ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఉంది. అయితే ఈ దూకుడే ప్రస్తుతం ఆయన కొంప ముంచేటట్లు కన్పిస్తుంది. ముందువెనుక చూసుకోకుండా ఆయన సొంత పార్టీ నేతపై చేసిన విమర్శలు ఆయనకు…
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇదివరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా లభించింది. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించడం, పైగా పర్యాటక మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోండటంతో కోమటిరెడ్డి ఆయనను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన…