రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గా భువనగిరి ఏరియా హాస్పిటల్,బిబినగర్ ఎయిమ్స్ 25 ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాము అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భారతదేశం ఈరోజు ఈ స్థితిలో ఉందంటే ఆరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చేపట్టిన సంస్కరణలు కారణం అని అన్నారు. పక్క రాష్ట్రాలలో కరోనాను ఉచిత వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం అలా చేయకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కరోనా ను ఆరోగ్యశ్రీ ఈరోజు చేర్చాలి. కరోనా కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడితే మన ముఖ్యమంత్రి కనీసం టేస్ట్ లు కూడా చేయట్లేదు. గాంధీ హాస్పటల్ లో మంచిగా ఉన్న పేషంట్ ల తో మాట్లాడి ఏదో నాటకాలాడే సమయం కాదిది. గాంధీ హాస్పిటల్ లో రోజుకు 70 మంది చనిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో 30-40 మరణాలను చూపిస్తున్నారు అని అన్నారు.