The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Hundred: ది హండ్రెడ్ 2026 టోర్నమెంట్లో సదర్న్ బ్రేవ్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు పడినా.. బౌలర్ ఖాతాలో మాత్రం హ్యాట్రిక్ నమోదు కాలేదు. మరి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..
మ్యాచ్ చివరి ఐదు బంతులను సదర్న్ బ్రేవ్ పేసర్ ల్యూక్ వుడ్ బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్‌లో 96వ, 97వ బంతుల్లో వరుసగా బెన్ ద్వార్షుయిస్, స్కాట్ కరీలను ఔట్ చేసి హ్యాట్రిక్ అవకాశాన్ని సృష్టించాడు. అయితే 98వ బంతికి సాకిబ్ మహ్మూద్ పరుగుకు ప్రయత్నించగా.. షార్ట్ థర్డ్‌మ్యాన్ నుంచి ఆదిల్ రషీద్ అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో అతడిని రన్అవుట్ చేశాడు. మూడో వికెట్ రన్అవుట్ రూపంలో రావడంతో అది బౌలర్ ల్యూక్ వుడ్ ఖాతాలో చేరలేదు. అందువల్ల వ్యక్తిగత హ్యాట్రిక్ నమోదు కాలేదు. అయితే జట్టు వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీయడంతో దీనిని టీమ్ హ్యాట్రిక్ గా పరిగణిస్తారు.
Also Read
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సదర్న్ బ్రేవ్ 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరఫున రెహాన్ అహ్మద్ 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఒక దశలో 47 బంతుల్లో 52/1 స్థితిలో కనిపించింది. కానీ ఆ తర్వాత సదర్న్ బ్రేవ్ బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు.
బ్యాటింగ్‌లో రాణించిన మార్కస్ స్టోయినిస్, బౌలింగ్‌లో కూడా మెరిశాడు. 10 బంతుల్లో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్ 20 బంతుల్లో 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ల్యూక్ వుడ్ అత్యధికంగా 3 వికెట్లు తీయడంతో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ 100 బంతుల్లో 9 వికెట్లకు 116 పరుగులకే పరిమితమైంది. దీంతో సదర్న్ బ్రేవ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి, ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన జట్టు ఈ విజయంతో గెలుపు బాట పట్టింది.
తాజావార్తలు
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!