Modi Hyderabad Tour: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. జూలై 8న వరంగల్‌లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నెల 8 న వారణాసి నుండి హైదరబాద్ కి ప్రధాని మోడీ ఉదయం 9.45 కి హాకిం పెట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
NVSS Prabhakar: తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రధాని రూ. 11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించారు, ఇది కేసీఆర్ కు కంటగింపుగా ఉన్నట్లుంది, అందుకే కేసీఆర్ గైర్హాజరయ్యారని ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి కౌంటర్లిచ్చారు. అవగాహన లేకుండా, చరిత్ర తెలియకుండా, మోదీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పదవికి తగ్గట్టుగా లేవన్నారు. మోదీకి కుటుంబం లేదని, అందువల్లే ఆయనకు సెంటిమెంట్లు తెలియవని అన్నారు. సీఎం కేసిఆర్‌ది కుటుంబ పాలన కాదని చెప్పిన ఎర్రబెల్లి.. తెలంగాణ కోసం ఆయన కుటుంబం ఉద్యమించి, జైళ్ళకు పోయి, త్యాగాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి వరాల జల్లు కురిపిస్తానని ప్రకటన చేసిన మోదీ.. ఇక్కడికొచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వీరయ్య విమర్శించారు. చిల్లర రాజకీయాలకు బేగంపేట విమానాశ్రయాన్ని వేదికగా చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం, టిఆర్ఎస్ పార్టీ మీదున్న అక్కసును వెళ్ళగక్కడానికే హైదరాబాద్ పర్యటనని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, పెద్దలు రాష్ట్రం కోసం…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ రాజకీయాల మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువింద గింజ తన కింద నలుపు చూసుకోవాలన్న ఆయన.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు బీజేపీలో లేడా? మీది కుటుంబ పార్టీ కాదా? పంజాబ్‌లో అకాళీదళ్‌తో అధికారాన్ని పంచుకోలేదా? అది కుటుంబ పార్టీ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడటం నిజంగా సిగ్గు చేటని, మీ ఎత్తులు ఎత్తి…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని, ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. తల్లిని చంపి పిల్లని బతికించారన్న మోదీకి.. తెలంగాణ అమరవీరుల గురించి అర్హత లేదని, అసలు తెలంగాణలో బీజేపీకి స్థానమే లేదని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని…
హైదరాబాద్ టూర్‌లో భాగంగా.. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ప్రజలతో ఎన్నుకోబడినదని, వాళ్ళెవరూ నామినేటెడ్ పదవులలో లేరని అన్నారు. గుజరాత్‌లో లేని అభివృద్ధి తెలంగాణలో ఉండడం చూసి.. ఆ ఈర్ష్యతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. దేవుణ్ణి చూపించి, మూఢ నమ్మకాల రాజకీయాన్ని బీజేపీ నడుపుతోందని విమర్శించారు. కానీ, తాము మాత్రం దేవుణ్ణి కొలుస్తూ రాజకీయం చేస్తున్నామని గంగుల కమలాకర్…