Ujjaini Maha kali Temple: అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. కాగా.. మోండా మార్కెట్ డివిజన్‌లోని ఆదయ్య నగర్ లైబ్రరీ నుంచి 2 వేల మంది మహిళలతో ఎమ్మెల్సీ కవిత ర్యాలీగా బయల్దేరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఉజ్జయిని అమ్మవారికి అమ్మవారికి కవిత మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు కవితను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కవిత మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు.
సికింద్రాబాద్ ఆలయానికి 250 ఏండ్ల పైబడి చరిత్ర ఉందని, హైదరాబాద్ నగరానికి ఉజ్జయిని అమ్మావారి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. విపరీతంగా వానలు కురుస్తోన్న నేపథ్యంలో వానలు తెరిపివ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలల్లో శాంతి పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వాన తెరిపి ఇవ్వాలని తాను కూడా ప్రార్థన చేయడం జరిగింది. అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని కవిత పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు.. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఇవాళ ఉదయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి జాతరకు అమ్మవారి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల వేడుకలు ఘటోత్సవంతో ప్రారంభమయ్యాయి. నేడు తెల్లవారుజామునుంచే భక్తులు బోనాలు సమర్పించి, ఉదయం 4 గంటలకి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు జరిపించారు.
Anathapuram Priest: కామ పూజారి.. కళ్లన్నీ మహిళా భక్తులపైనే..!!
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!