Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో గ్రూప్-2 కేడర్ లో డిప్యూటీ తహశీల్దార్‌గా శిక్షణ పొందుతున్న డోలి సంధ్య (28) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ పట్టణంలోని సీతాకోకచిలుకల సెంటర్ సమీపంలో నివసించే డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్న కుమార్తె అయిన సంధ్య, ప్రతిభావంతురాలైన అధికారిణిగా పేరుపొందారు. సంధ్య గతంలో గ్రూప్-4 పరీక్షలో విజయం సాధించి మహబూబాబాద్ మున్సిపాలిటీలో సేవలు అందించారు. ఆ తర్వాత ఆమె గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికై డిప్యూటీ తహశీల్దార్‌గా ఉద్యోగం పొందారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రెవెన్యూ శాఖలో ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె, ఇటీవల సెలవుపై మహబూబాబాద్‌లోని తన స్వగృహానికి వచ్చారు.
ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయాన్ని చూసి సంధ్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
అయితే సంధ్య ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె మృతిపై తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంధువుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య ఆత్మహత్యకు గల అసలు కారణాలు, మానసిక ఒత్తిళ్లా లేదా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!