Mega 158 : చిరు – బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన ఈ సక్సెస్ఫుల్ కాంబో నుంచి మరో భారీ చిత్రం రాబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి ‘కాకా‘ అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ టీజర్లోనే సినిమా టైటిల్‌తో పాటు గ్రాండ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఊరమాస్ కాంబినేషన్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న Mega158 తదుపరి షెడ్యూల్లో భాగంగా, చిత్ర బృందం ఒక ప్రత్యేక పాటను చిత్రీకరించనుంది. అలాగే యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో మెగాస్టార్ చిరంజీవి మరియు వందలాది మంది ఆర్టిస్ట్స్ తో కూడిన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!