Jana Nayagan OTT Release: ఓటీటీలోకి దళపతి విజయ్ ‘జన నాయగన్’.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Nayagan OTT Release: దళపతి విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. విజయ్ సినీ కెరీర్లో చివరి చిత్రంగా ప్రచారం పొందిన ‘జన నాయగన్’ (Jana Nayagan) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, విజయ్‌కు ఉన్న మాస్ క్రేజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇంటి నుంచే చూసే అవకాశం లభించనుంది. మరి ఈ సినిమాను ఎక్కడ ? ఎప్పుడు ? చూడచ్చో తెలుసుకుందాం పదండి.
జీ5లో స్ట్రీమింగ్
‘జన నాయగన్’ స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకుంది. ఈ మూవీ 2026 ఆగస్టు 21 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆఫీషియల్ అనౌన్స్ కూడా ఇచ్చారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఒకేసారి డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే హిందీ వెర్షన్ మాత్రం వెంటనే స్ట్రీమింగ్ కాకుండా ఎనిమిది వారాల తర్వాత అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో థియేటర్లలో విజయ్ చివరి సినిమాను చూడలేకపోయిన అభిమానులు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
- Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
ఈ సినిమాలో విజయ్ ప్రధాన పాత్రలో నటించగా, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరేన్, ప్రియమణి తదితరులు కూడా సినిమాలో భాగమయ్యారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
‘జన నాయగన్’ స్టోరీ
ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఒక ప్రమాదంలో చనిపోతూ తన కూతురు విజి బాధ్యతను వెట్రి (విజయ్)కి అప్పగిస్తాడు. శ్రీకాంత్ ఆఖరి కోరిక ప్రకారం విజిని ఇండియన్ ఆర్మీలో చేర్చాలని వెట్రి లక్ష్యంగా పెట్టుకుంటాడు. కానీ విజి చిన్నతనంలో తన తల్లి దారుణంగా హత్యకు గురవడం కళ్లారా చూడటం వల్ల తీవ్రమైన మానసిక భయాలతో బాధపడుతుంటుంది. ఒక అమ్మాయి సమాజంలో ఒంటరిగా బతకాలంటే శారీరకంగా, మానసికంగా ఎంత ధైర్యంగా ఉండాలో నేర్పిస్తూ వెట్రి ఆమెను ఆర్మీ పరీక్షల కోసం సిద్ధం చేస్తుంటాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తండ్రి-కూతుళ్ల లాంటి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది.
మరోవైపు అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి అయిన జాన్ హిమ్లర్, అవినీతి రాజకీయ నాయకులతో చేతులు కలిపి ‘ప్రాజెక్ట్ MM’ ద్వారా దేశంలో అలజడి సృష్టించాలని ప్లాన్ చేస్తాడు. ఈ వినాశనాన్ని ఆపగల ఆధునిక టెక్నాలజీని రూపొందించిన సైంటిస్ట్ ఖలీల్ లాబ్పై హిమ్లర్ గ్యాంగ్ దాడి చేస్తుంది. ఖలీల్ చనిపోయే ముందు ఆ రహస్య సమాచారం ఉన్న ఫైల్‌ను ముఖ్యమంత్రికి చేరవేయమని విజికి ఇస్తాడు. దీంతో విజి విలన్ల టార్గెట్‌గా మారుతుంది.
తన కూతురి లాంటి విజిని కాపాడుకోవడానికి వెట్రి రంగంలోకి దిగుతాడు. కేవలం విజిని రక్షించడమే కాకుండా, విలన్ల వెనుక ఉన్న అవినీతి రాజకీయ వ్యవస్థను, ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పును వెట్రి ఎలా ఒంటరిగా ఎదిరించాడనేదే మిగతా కథ. ఈ పోరాటంలో విజి కూడా తన భయాలను అధిగమించి శత్రువులపై ఎలా తిరగబడింది, వెట్రి ప్రజల పక్షాన నిలబడి ఒక ‘జన నాయగన్’ (ప్రజా నాయకుడు) గా ఎలా ఎదిగాడనేది క్లైమాక్స్.
- Tags
- cinema
- Vijay Jana Nayagan
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!