KBR Park One Way: కేబీఆర్ పార్క్ చుట్టూ అమల్లోకి వచ్చిన వన్ వే.. ప్రధాన రూట్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేడు ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాల రాకపోకలను ఏడాదిన్నర పాటు వన్‌వేగా మళ్లిస్తూ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం, ట్రాఫిక్ రద్దీ నివారణ పనుల నేపథ్యంలో ఇప్పటికే ఏప్రిల్ 5, జూన్ 21 తేదీల్లో రెండుసార్లు ట్రయల్ రన్లు విజయవంతంగా నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా పార్క్ పరిసరాల్లో స్పష్టమైన సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లాలంటే, నేరుగా రోడ్ నంబర్ 10 (ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి మార్గం) గుండా వెళ్లి, కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న క్లాక్‌వైజ్ (వన్‌వే) మార్గంలోనే ప్రయాణించాలి.
జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు వెళ్ళేందుకు ప్రధాన మార్గాలు ఇలా..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
వెంకటగిరి / ఇందిరా నగర్ వైపు నుంచి: వెంకటగిరి రోడ్డు మీదుగా నేరుగా జూబ్లీ చెక్‌పోస్ట్ జంక్షన్ చేరుకోవచ్చు.
రోడ్ నంబర్ 45 / జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి: BVB జంక్షన్ దాటి, రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు ప్రయాణించవచ్చు.
ఎన్టిఆర్ భవన్ / అన్నపూర్ణ స్టూడియో వైపు నుంచి: NTR భవన్ వైపు నుండి రోడ్ నంబర్ 2 మీదుగా వచ్చి, E11 లేదా E12 ఎగ్జిట్ పాయింట్ల ద్వారా జూబ్లీ చెక్‌పోస్ట్ రోడ్డుకు చేరుకోవచ్చు.
డైమండ్ హౌస్ / మాదాపూర్ వైపు నుంచి: అల్కాజర్ మీదుగా డైమండ్ హౌస్ రోడ్డు నుండి జూబ్లీ చెక్‌పోస్ట్ జంక్షన్‌కి చేరుకోవచ్చు.
లేన్ ఛేంజ్ పాయింట్లు: జూబ్లీ చెక్‌పోస్ట్ ప్రాంతం వద్ద సులభంగా మళ్లడానికి LC 6 (రోడ్ నం. 65 U-టర్న్), LC 7 (క్రీమ్ స్టోన్) ఉపయోగపడతాయి.
ఈ నూతన ట్రాఫిక్ విధానాన్ని పర్యవేక్షించేందుకు పోలీసులు ప్రతిరోజూ నాలుగు షిఫ్టుల్లో సిబ్బందిని విధుల్లో ఉంచారు. అలాగే ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు రెండు ప్రత్యేక డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. వాహనదారులు లేన్-1, లేన్-2 బోర్డులను గమనిస్తూ క్రమశిక్షణతో వాహనాలు నడపాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ లేదా మితిమీరిన వేగంతో వెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆంక్షలు అమల్లో ఉన్నందున ప్రయాణికులు సైన్ బోర్డులను గమనిస్తూ సహకరించాలని సూచించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!