Tractor Cage Wheel: ట్రాక్టర్ కేజ్‌వీల్స్ సమాచారం అందించండి.. రూ.5 వేలు పొందండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి, ప్రజల ప్రయాణ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నాణ్యమైన రహదారులను నిర్మిస్తోంది. మౌలిక వసతుల కల్పనతో ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా, రవాణా వ్యవస్థ కూడా సులభతరమవుతుంది. అయితే కొందరి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఈ రోడ్లు నిర్మించిన కొద్ది కాలానికే తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ అమర్చి, వాటిని నేరుగా తారు, సిమెంట్ రోడ్లపై నడపడం వల్ల రోడ్ల రూపురేఖలు మారిపోతున్నాయి.
వరి నాట్లు, పొలం దుక్కి పనుల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ పొలం పనులు పూర్తయిన తర్వాత ఆ ఇనుప చక్రాలను తొలగించకుండా, నేరుగా తారు లేదా సీసీ రోడ్లపై నడపడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇనుప చక్రాల పదునైన భాగాలు రోడ్డు ఉపరితలంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల తారు పొరలు ఊడిపోయి, పెద్ద పెద్ద గోతులు ఏర్పడతాయి. సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాల పాటు నిలిచేలా నిర్మించిన రహదారులు, ఈ కేజీ వీల్స్ రాపిడి కారణంగా కేవలం 15 నుంచి 20 నెలలకే పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. దీనివల్ల నిరంతరం మరమ్మతులు చేయాల్సి వచ్చి ప్రభుత్వానికి, పంచాయతీలకు అదనపు ఆర్థిక భారం పడుతోంది. అంతేకాకుండా.. దెబ్బతిన్న రోడ్ల వల్ల ద్విచక్ర వాహనదారులు, బాటసారులు ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడుతున్నారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, ప్రజారోగ్యంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేందుకు వరంగల్ జిల్లా మంగపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కోట్ల రూపాయల వ్యయంతో మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులతో వీధులను ఎంతో అందంగా ఆధునీకరించారు. ఈ నూతన రహదారులను రక్షించుకోవడానికి అధికారులు వినూత్నంగా ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నారు.
మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లయిన గంపోనిగూడెం క్రాస్, కోమటిపల్లి క్రాస్, ప్రభుత్వ ఆసుపత్రి మార్గం, జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంతం, ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా, మహావీర్ వై జంక్షన్, వైఎస్ఆర్ సెంటర్ మరియు ప్రధాన హైవే రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా కేజీ వీల్స్‌తో తిరిగే ట్రాక్టర్ల సమాచారాన్ని అందించిన వారికి రూ. 5,000 నగదు బహుమతి అందజేస్తామని పంచాయతీ అధికారులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించే ట్రాక్టర్ల ఫోటోలు లేదా వీడియోలను తీసి ‘మంగపేట గ్రామపంచాయతీ’ వాట్సాప్ గ్రూప్‌లో గానీ, లేదా పంచాయతీ కార్యదర్శి నంబర్ కు పంపించి ఈ పారితోషికాన్ని పొందవచ్చని సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందనే చైతన్యాన్ని ఈ నిర్ణయం కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!