Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dating Rumors: ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ, బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రచారాలపై 15 ఏళ్ల తర్వాత స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లకు ఆయన పూర్తిగా చెక్ పెడుతూ.. తమ మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ సీజన్లలో బ్రెట్ లీ కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటాతో ఆయన తరచూ కనిపించడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఈ ప్రచారం చాలాకాలం కొనసాగింది.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో బ్రెట్ లీ ఈ వార్తలను ఖండించారు. “నేను ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదు. ప్రజలు తమకు నచ్చినట్లు ఊహాగానాలు చేసుకుంటారు. కానీ అలాంటి వార్తలను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు నిజం తెలుసు కాబట్టి అవి నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు” అని ఆయన చెప్పారు. ప్రీతి జింటాపై బ్రెట్ లీ ప్రశంసలు కూడా కురిపించారు. కింగ్స్ XI పంజాబ్‌లో కలిసి పనిచేసిన రోజుల్లో తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, భారతదేశంలో తనకు అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ప్రీతి ఒకరని తెలిపారు. ఆమె ఎంతో తెలివైన వ్యక్తి అని, ఆమెపై తనకు అపారమైన గౌరవం ఉందని వెల్లడించారు. గతంలో 2011లో కూడా బ్రెట్ లీ ఇదే విషయంపై స్పందిస్తూ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని స్పష్టం చేశారు. ఇక ప్రీతి జింటా కూడా అప్పట్లో ఈ రూమర్లను ఖండించారు. 2010లో సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె “నేను ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్ చేయడం లేదు. ఎవరితోనైనా రిలేషన్లో ఉంటే ఆ విషయాన్ని నేనే చెబుతాను” అంటూ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ప్రీతి జింటా తన భర్త జీన్ గూడెనఫ్‌తో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 2016లో వీరిద్దరూ వివాహం చేసుకోగా, 2021లో సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. మరోవైపు బ్రెట్ లీ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా, క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు.
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..