MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ఎన్టీవీతో క్వశ్చన్ అవర్‌లో మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తప్పుల తడక ఉన్నప్పటికీ బీసీ కులగణన జరిగిందని, ముస్లింలు, బీసీలు, కలిపి 56 శాతం ఉండాలి.. కానీ రేవంత్ రెడ్డి 42 శాతమే ఇచ్చారన్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చని, సెప్టెంబర్ 30 వరకూ ఉన్న డెడ్‌లైన్‌లోపు ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చు అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.
Variety Thiefs: హైదరాబాద్‌లో వెరైటీ చోరీ.. అవాక్కవుతున్న జనాలు!
బీజేపీపై ఒత్తిడి చేయకుండా.. పోరాటం చేసే మాపై విమర్శలు చేస్తే ఏంవస్తుందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్లో నేను లైఫ్ టైమ్ మెంబర్ని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ఆందోళన చేశానని, మా మధ్య అభిప్రాయబేధాలే, బేధాభిప్రాయాలు కాదని ఆమె వెల్లడించారు. అయితే.. లేఖ లీక్ చేసిందెవరో చెప్పాలన్నదే తన డిమాండ్ అని, వాళ్లను పట్టుకునేవరకు నేను దూరంగా ఉండాలన్నకున్నట్లు ఆమె వెల్లడించారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో వాళ్లను పార్టీనుంచి పంపించేయాలన్నదే తన డిమాండ్‌గా ఆమె తెలిపారు.
ఎవరికీ పోటీగా మీటింగ్ పెట్టలేదన్న కవిత… యాక్సిడెంటల్‌గా పార్టీ మీటింగ్ పెడితే పెట్టి ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు, పార్టీకి ఎప్పటికీ నష్టం చేయనని, లేఖను లీక్ చేసినవారే సీఎం రమేష్‌తో మాట్లాడించి ఉండొచ్చు అని అన్నారు. కుట్ర ప్రకారమే లేఖ బయటకు వచ్చిందని ఆమె వెల్లడించారు. EWSలో ముస్లింలకు రిజర్వేషన్లు వస్తున్నాయని, గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని మోడీ చెబుతున్నారు ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Tollywood: తెలుగు మీద కన్నేస్తున్న తమిళ, మలయాళ, కన్నడ హీరోలు