తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీపై మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మేడారం జాతరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎంపీ బండి సంజయ్ ను ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అన్నారు ఎమ్మెల్సీ కవిత. స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ మొత్తం 332.71 కోట్ల రూపాయలను విడుదల చేశారన్నారు. 2014…