దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఈ అంశంపై పార్టీ మారిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
MLA Rajaiah: జనగామ జిల్లా స్టేషన్ ఘనపు నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందస్తుగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రజా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తన వెంట ఉన్న వారు లింగాల గణపురం మండలం కేంద్రంలో జరిగిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరు కాకపోవడం వారిపై ఆయన పరోక్షంగా చురకలాంటించారు.