MLA Rajaiah Controversial Comments On Kadiyam Srihari: ఎమ్మెల్యే టీ.రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య అధిపత్యపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నాయకుల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజయ్య మరోసారి కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని, ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అని, ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కుండబద్దలు కొట్టారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో రాజయ్య మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని వెంటనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
Flipkart: గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. 30 సెకన్లలోనే పర్సనల్ లోన్..
ఎంపీలు గానీ, ఎమ్మెల్సీలు గానీ.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాతే నియోజకవర్గంలోకి రావాలని.. కానీ కడియం శ్రీహరి మాత్రం 2014 నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని రాజయ్య మండిపడ్డారు. 2014 -18 ఎన్నికల సమయంలో తాను తన ఆస్తులు మొత్తం అమ్ముకున్నానన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కాకముందు అతని ఆస్తులు ఎంతో, ఇప్పుడు ఎంతో చూడాలని అన్నారు. తెలంగాణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్‌కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి కూడా, ఏనాడు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు.. కడియం శ్రీహరితో పాటు ఆయన అనుచరులు సైతం ఏనాడూ హాజరు కారని చెప్పారు.
Madhu Yaskhi Goud: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బిఆర్ఎస్ పార్టీది
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగా జరిగాయని.. నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. దళితులందరూ చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడటం తన బాధ్యత అని, నియోజకవర్గంలో గొప్పగా పని చేస్తున్న తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ.. ఇంటింటికీ తిరుగుతానన్నారు. కేసీఆర్ తనని తప్పకుండా పిలిపించుకుంటారని, గ్లోబెల్స్ ప్రచారం చేసేవాళ్ల మాటలు నమ్మొద్దని రాజయ్య చెప్పుకొచ్చారు.