కరోనా సమయంలో అంబులెన్స్‌లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.. ఒకవేళ దొరికినా అడిగినంత సమర్పించుకోవాల్సిన పరిస్థితి.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్‌పురా కేశవనిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రాంత అధ్యక్షుడు దుర్గారెడ్డి, కార్యదర్శి ప్రభల రామ్మూర్తి సహా ఇతర సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు. సేవా భారతి…
సంగా రెడ్డిలో రెండు ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, త్వరలో మరొక 13 అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… తల్లితండ్రులు జ్ఞాపకార్థము పేద ప్రజలకోసం రెండు ఉచిత అంబులెన్సులను ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మరో 13 అంబులెన్స్ లు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రాజకీయం కోసం కాదు చాలా రోజుల నుండి తల్లితండ్రుల పేరు మీద సర్వీస్ చేయాలని ఆలోచనతో చేస్తున్నాను. పేద…