Miyapur Lover Attack: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన మియాపూర్ ప్రేమోన్మాది ఘటనలో బాధితురాలి తల్లి శోభా మృతి చెందింది. మరికాసేపట్లో శోభా మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనున్నారు పోలీసులు. శోభా మృతితో మియాపూర్ నుండి గాంధీకి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మరో వైపు గాంధీలోనే బాధితురాలు వైభవి కోలుకుంటుంది. ఉన్మాది సందీప్ దాడిలో గాయపడ్డ బాధితురాలికి 22 కుట్లు వేసిన వైద్యులు తెలిపారు. బాధితురాలి చేతికి 10 కుట్లు, ఛాతీ కి 12 కుట్లు పడినట్లు వైద్యులు వెల్లడించారు. వైభవి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే.. ఉన్మాది సందీప్ కోటి ఈఎన్‌టీ లో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Read also: Prashant Kishor: పది పాస్ కాని తేజస్వీ యాదవ్ సీఎం కావాలని కలలు కంటున్నాడు.
అసలు ఏం జరిగింది:
కాగా, గుంటూరు జిల్లా సందిపల్లికి చెందిన శోభ దంపతుల కుమార్తె వెంకటరాజు, నిందితుడు సందీప్ గతంలో ప్రేమించుకున్నారు. ఇంట్లో వారు శోభను మందలించడంతో.. దీంతో శోభ సందీప్‌ను దూరంగా పెట్టింది. ఆమెకు మరోకరితో వివాహం నిశ్చయించారు. అయితే ఈవిషయం తెలుసుకున్న సందీప్ ఆమెకు వేరే వేరే నంబర్లతో మెసేజ్ చేశారు. అయినా శోభ స్పందించకపోవడంతో.. కోపంతో రగలిపోయాడు. శోభ, తల్లి వైభవీ ఇంటికి వెళ్లాడు గొడవ చేశాడు. కత్తితో తల్లి, కూతుళ్లపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి అరుపులు విన్న స్థానికులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిన్న (మంగళవారం) ఉదయం 10:30గంటల ప్రాంతంలో మియపూర్ లోని బాధిత ఇంటికి వచ్చిన సందీప్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఈఘటనలో తల్లి మృతి చెందడంతో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈదారుణానికి ఒడిగట్టిన సందీప్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Australia: అత్త సొమ్ము.. అల్లుడి దానమంటే ఇదేనేమో.. చివరికి జైలుపాలయ్యాడు