దేశంలో మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయాల్లో సంగతి పక్కనబెడితే.. పట్టపగలు ఒంటరిగా మహిళలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ మద్య కాలంలో కొంతమంది ఆకతాయిలు ప్రేమ పేరుతో యువతులను వేధిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన మియాపూర్ ప్రేమోన్మాది ఘటనలో బాధితురాలి తల్లి శోభా మృతి చెందింది. మరికాసేపట్లో శోభా మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనున్నారు పోలీసులు. శోభా మృతితో మియాపూర్ నుండి గాంధీకి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు.