ఎమ్మెల్సీ కవిత ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పరామర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా
మంత్రి తలసాని మాట్లాడుతూ.. వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటి పైకి రావడం దుర్మార్గం, హేయమైన చర్య అని మండిపడ్డారు. మేమంతా అక్కడ ఉన్నాం, బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదు, మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
నిన్న ముట్టడికి కారణం ఏంటో, ఆ అంశంపై మీకు అవగాహన ఉందా? అంటూ తలసాని ప్రశ్నించారు. ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన మాటలను, ఫాల్స్ ఎలిగేషన్ ను పట్టుకొని, బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదని మండిపడ్డారు. వేలాది సైన్యం మాకు ఉంది, మీ ఇళ్ల మీద దాడులు, పార్టీ ఆఫీసుల మీదకు వస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. సంగీభావం చెప్పడానికి వచ్చిన మా కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తామని అంటున్నారని పేర్కొన్నారు. మాకు సంస్కారం ఉంది, మా అధినేత అది నేర్పలేదని తలసాని వ్యాఖ్యానించారు. నిన్నటి ముట్టడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు తెలిపారు.
నిన్న ఎమ్మెల్సీ కవిత గారి ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేసిన నేపధ్యంలో భారీ అనుచరగణంతో వారి ఇంటికి చేరుకొని సంఘీభావం తెలపడం జరిగింది. @RaoKavitha pic.twitter.com/ExoyLnUx4E
— Talasani Srinivas Yadav (@YadavTalasani) August 23, 2022