Minister Seethakka: ఇవ్వాళ నిర్మల్ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించనున్నారు. అక్కడ భైంసాలో కార్యకర్తల సమావేశంలో సీతక్క పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పర్యటించనున్నట్లు తెలిపారు. ఇవాళ భైంసాలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
Read also: Chandrababu: కుప్పంలో రెండ్రోజుల పాటు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
నిన్న నిర్మల్ జిల్లా ఖానాపూర్ అంబేద్కర్ నగర్ కాలనీలో గత నెలలో హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. గత నెలలో ప్రేమ పేరుతో శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో అలేఖ్యపై దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. ఖానాపూర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి హామీ ఇవ్వలేమని మంత్రి సీతక్క అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీతక్క హామీ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాంటి వారిని శిక్షిస్తే భవిష్యత్తులో మరో ఘటన జరగకుండా ఉంటుంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఆదుకుంటామని తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఉన్నారు.
ECIL Recruitment: ఈసీఐఎల్ – హైదరాబాద్ లో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా..!