Sabitha Indra Reddy: విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.. విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని, కష్టపడి చదివిన విద్యార్థులు ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలి ఆకాక్షించారు. విద్యార్థులెవరూ భయానికి, ఆందోళనకు గురికావద్దు అని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,07,393 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందుకోసం 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
Read Also: Union minister Danve: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లో తీవ్రస్థాయిలో కులతత్వం..!
Also Read
- CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు వార్షిక పరీక్షలను నిర్వహించుకోలేకపోయం.. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల సందర్భంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు మంత్రి సబిత.. ఇక, విద్యార్థుల సౌకర్యార్థం 70 శాతం సిలబస్ నుండి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతోందని, ప్రశ్నల ఛాయిస్ పెంచడం జరిగిందని తెలిపిన ఆమె.. వేసవి కాలం దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని.. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయలని పేర్కొన్నారు.
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా విద్యార్థులు తల్లిదండ్రులుసహకరించాలి సూచించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేర్చే విధంగా ప్రణాళిక చేసుకోవాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులెవరైనా మానసిక వత్తిడికి గురైతే.. ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005999333కు ఫోన్ చేసి విలువైన సలహాలు పొందవచ్చు అని ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!