ఒమిక్రాన్ ఎంట్రీతో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది.. భారీగా కేసులు వెలుగు చూశాయి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. కోవిడ్ విజృంభణ సమయంలో కఠిన ఆంక్షలు విధించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. మళ్లీ సడలింపులు ఇస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను మూసివేసి.. ఆన్‌లైన్ విద్యకే పరిమితం అయ్యాయి.. ఇప్పుడు మళ్లీ విద్యాసంస్థలను తెరవడంపై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ సమయంలో.. స్కూళ్ల పునః ప్రారంభంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. Read Also:…
కరోనా ఏ రాష్ట్రాన్నీ వదలడం లేదు. నెల క్రితం వందల్లో వున్న కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. తాజాగా ఏపీలో కరోనా భారీగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు, విశాఖ, చిత్తూరు జిల్లాలలో కరోనా కట్టడిపై అధికారులు చేతులెత్తేశారేమో అనిపిస్తోంది. జిల్లాలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు, తెరుచుకున్న సినిమా థియేటర్లతో పాటు సందడి ఎక్కువైంది. మూడు నెలలుగా కరోనా కొత్త వేవ్ వస్తుందని ప్రపంచం మొత్తం మొత్తుకుంటున్నా అధికారులకు మాత్రం చీమ…
కరోనా నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్‌కు దూరదృష్టి లేదన్నారు. కరోనా థర్డ్ వేవ్ అందోళనకరంగా ఉంది.విద్యా సంస్థలను కనీసం ఈ నెలాఖరు వరకూ మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ బారి నుంచి కాపాడుకోగలం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం- కేసులు పెరిగితే చూద్దాం అని చెప్పడం బాధ్యతారాహిత్యం. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత…
ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా అదుపులో వుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.సంక్రాంతి శెలవుల తర్వాత స్కూళ్లు రీ-ఓపెన్ అయ్యాయి. ఎంత మంది వచ్చారనే అటెండెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటున్నాం అన్నారు. గత రెండేళ్లల్లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయాం.విద్యార్ధుల భవిష్యత్, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇస్తున్నాం.సుమారు 22 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సిన్ వేసేశాం.విద్యార్ధులకు 90 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తైంది.టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ వేశాం.ఎకడమిక్ ఇయరుని ముందుగా నిర్ణయుంచుకున్న…
దాదాపు రెండేళ్లుగా ప్రపంచం కరోనా గుప్పిట్లోనే మగ్గుతోంది. కోవిడ్-19కి విరుగుడుగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం ఆ మహమ్మరి సృష్టించిన భయం మాత్రం పోవడం లేదు. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా ప్రభావం ఎక్కువగానే కన్పిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్ లో ఎంతో అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వం సెకండ్ వేవ్ లో పాలకుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంది. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడంపై భిన్నాభిప్రాయాలు…
టీఎస్ హైకోర్టులో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై పిల్ నమోదయ్యింది. ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వం ఎలాంటి గైడ్ లెన్స్ లేకుండా విద్యా సంస్థలు ప్రారంభించడాన్ని సవాలు చేసారు పిటీషనర్. దాంతో ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. అయితే నేడు పిటీషన్ పై…
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే. స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం బాగానే ఉన్నా.. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలే సర్పంచ్‌లకు టెన్షన్ పెడుతున్నాయట. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ప్రభుత్వం నుంచి పైసా రాదు. స్కూళ్లు సాఫ్ చేయకపోతే.. జేబులు సఫా. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదట సర్పంచ్‌లకు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వ ఆదేశాలతో సర్పంచ్‌లు ఉలికిపాటు! తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. విద్యార్థులకు తరగతి…
వచ్చే నెల 1 నుండి అన్ని విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ విషయం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాము. వైద్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం…