Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌కు నలువైపుల నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో నిమజ్జన ప్రక్రియకు స్వల్ప ఆలస్యం జరుగుతుండగా, శోభాయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. నిమజ్జనం నేపథ్యంలో శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ కారణంగా సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి నుంచి ఎంతో ప్రశాంత వాతావరణంలో, వైభవంగా కొనసాగుతోందని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించి, నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైందని పేర్కొన్నారు. ఈ శోభాయాత్ర నేటి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున, విగ్రహాల నిమజ్జనాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి పోలీస్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ కారణంగా సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప సాధారణ వాహనదారులు ఈ మార్గాల్లో రాకపోకలను పూర్తిగా నివారించి, ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమో చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రహదారులపైకి వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడవద్దని సూచించారు. ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక సూచనలు, అడ్వైజరీలను గమనిస్తూ నగర ప్రజలంతా పోలీసు యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
Also Read
ఇక, ఇప్పటికే హుస్సేన్ సాగర్‌లో వేలాది వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యాయి. ప్రతి విగ్రహంతో పాటు పదుల సంఖ్యలో భక్తులు, మండపాల నిర్వాహకులు ఊరేగింపుగా తరలివస్తున్నారు. విగ్రహాలు మోసుకొచ్చే ప్రతి వాహనం నుంచి బ్లోయర్స్ ద్వారా రంగు రంగుల పేపర్లను గాల్లోకి ఎగరవేస్తుండటంతో.. ట్యాంక్ బండ్, NTR మార్గ్ రోడ్లపై కొన్ని టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. రోడ్లపై విపరీతంగా పేరుకుపోయిన చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను జిహెచ్ఎంసి (GHMC) కార్మికులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. గత 13 రోజులుగా నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, NTR మార్గ్ రోడ్లపై పడుతున్న వ్యర్థాలను జిహెచ్ఎంసి సిబ్బంది నిరంతరం శుభ్రం చేస్తూ పరిశుభ్రతను కాపాడుతున్నారు.
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!