KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం.. తెలంగాణ సోయికి నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ అని మాజీ మంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించడం ద్వారా మాత్రమే, ఐలమ్మకి నిజమైన నివాళి అర్పించినవాళ్ళమౌతామని తెలిపారు. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె త్యాగాలను స్మరించుకుంటూ మాజీ సీఎం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నాటి రాచరిక పాలనలో తెలంగాణ రైతాంగ న్యాయమైన హక్కుల కోసం ధిక్కార స్వరం వినిపించిన ధీరవనిత ఐలమ్మ అని, అణచివేతకు గురవుతున్న సబ్బండ కులాల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారని కేసీఆర్ కొనియాడారు. నాటి భూస్వాములను ధైర్యంగా ఎదురించి ధిక్కారాన్ని చాటడమే కాకుండా, నాటి చట్టాల పరిధిలోని న్యాయస్థానాల్లో పోరాడి గెలిచి ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించిన ఆమె పోరాట పంథా నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమన్నారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రస్తుత అస్తవ్యస్త పాలనా రాజకీయ పరిస్థితుల్లో, ఐలమ్మ చూపించిన ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి, తెలంగాణ సోయి నేటి యువత తప్పక అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుత పంథాలో తాను ప్రారంభించిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కూడా ఐలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని గుర్తుచేశారు.
ఐలమ్మ గొప్పతనాన్ని, ఆమె పోరాట చరిత్రను భవిష్యత్తు తరాలకు చాటేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సాంప్రదాయాన్ని నెలకొల్పిందని కేసీఆర్ తెలిపారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగానే పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలు, శిశు సంక్షేమం, రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అనేక వినూత్న పథకాలను అమలు చేశామన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూ, కుల వృత్తులకు జీవం పోసి సబ్బండ వర్గాల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టామని, ఆ నమూనా సాధించిన ఫలితాలు నేడు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని చెప్పారు. తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించడం ద్వారా మాత్రమే ఐలమ్మకు మనం నిజమైన నివాళి అర్పించినవాళ్లమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
- Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
- Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
- APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!