Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Ktr Participated In Pm Gati Shakti South Zone Virtual Conference

తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహించండి.. దేశ వృద్ధి రేటుకు ప్రయోజనం..

Published Date :January 17, 2022 , 7:09 pm
By Sudhakar Ravula
తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహించండి.. దేశ వృద్ధి రేటుకు ప్రయోజనం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు మద్దతు ఇవ్వండి.. అవి దేశ వృద్ధి రేటుకు కూడా ఉపయోగడతాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన గతి శక్తి సౌత్ జోన్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేటీఆర్… మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్, పవర్, బొగ్గు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ప్రస్తావించారు.. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో 35 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందన్న ఆయన.. భౌగోళిక వనరులలో సహజ ప్రయోజనాలు, ప్రపంచస్థాయి నైపుణ్యం, ఇప్పటికే ఉన్న తయారీ పద్ధతులు, నైపుణ్యంతో… పెట్టుబడులకు కొత్త అవకాశాలను కల్పించామని తెలిపారు. కానీ, పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు తగిన సహకారం అందడం లేదని.. పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.

Read Also: ఇక 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌..!

తెలంగాణలో హైదరాబాద్‌కు అనేక దశాబ్దాల చరిత్ర ఉందని ఈ సందర్భంగా ప్రస్తావించారు మంత్రి కేటీఆర్.. రక్షణ రంగానికి సంబంధించిన పటిష్టమైన పర్యావరణ వ్యవస్థ ఉందని గుర్తుచేసిన ఆయన.. కానీ… కేంద్ర ప్రభుత్వం బుందేల్‌ఖండ్‌కు రక్షణ కారిడార్‌ను ఇచ్చింది.. అక్కడ ఎటువంటి పర్యావరణ వ్యవస్థ ఉనికిలో లేదు… సంస్థలు కూడా లేవు అన్నారు. డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్, డీఎంఆర్‌ఎల్, ఆర్‌ఎస్‌ఐ, అనురాగ్ వంటి రక్షణ సంస్థలకు తెలంగాణ రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఉంది.. అనేక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్‌ను స్థావరంగా మార్చుకున్నాయన్నారు. రాష్ట్రం చాలా అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది.. రక్షణ కారిడార్‌కు మేం కేరాఫ్ అడ్రస్ అని గర్వంగా చెప్పుకుంటున్నాం అన్నారు. పెరిగిన ఫ్రీక్వెన్సీతో వివిధ పోర్టులకు ప్రత్యేకమైన కార్గో రైలు నెట్‌వర్క్‌ను అందించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్… లాజిస్టిక్ మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను మంజూరు చేస్తే… రాష్ట్రం డ్రై పోర్ట్‌లు, ఇంటిగ్రేటెడ్ అండ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేసుకునే వీలు ఉందన్న ఆయన.. హైదరాబాద్‌కు అన్ని ఓడరేవులకు రైలు సౌకర్యం ఉన్నప్పటికి.. ఓడరేవులకు రైళ్ల రాకపోకలు ప్రధాన సమస్యగా మారిందని.. గూడ్స్ వేగంగా వెళ్లేందుకు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలి కోరారు. నార్త్-సౌత్ ఫ్రైట్ కారిడార్ హైదరాబాద్ ప్రాంతాన్ని తాకకుండానే… తెలంగాణ మీదుగా వెళ్తోంది.. మేక్ ఇన్ ఇండియా.. ఇప్పుడు అసెంబ్లింగ్ ఇన్ ఇండియా కార్యక్రమంగా మారింది అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహిస్తే… భారత వృద్ధి రేటుకు ప్రయోజనం చేకూరుస్తుంది.. దేశ ఎగుమతి లక్ష్యాన్ని చేరుకోవడానికి గణనీయంగా దోహదపడుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కేటీఆర్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gati Shakti South Zone Conference
  • hyderabad
  • Minister KTR
  • nitin gadkari
  • PM Gati Shakti South Zone Conference

తాజావార్తలు

  • IPL Orange Cap: కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. ఈ స్టార్ ప్లేయరే ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ ‘కింగ్’..!

  • Sri Lanka Refuses US Military Aircraft Landing: అమెరికా యుద్ధ విమానాలు దిగేందుకు నో చెప్పిన శ్రీలంక..

  • Iran War: ఇరాన్‌కు రూ.18 కోట్లు చెల్లించి.. హర్మూజ్ జలసంధిని దాటిన చమురు నౌక..

  • Virosh: పెళ్ళికి పిలవలేదని రీల్ చేసిన చిన్నారి.. ఇంటికి పిలిపించుకుని షాకిచ్చిన దేవరకొండ దంపతులు

  • Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్‌ నటించే సినిమా ఏంటి?

ట్రెండింగ్‌

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions