Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: దేశ రక్షణలో సేవలందించి, పదవీ విరమణ అనంతరం సమాజంలో హుందాగా జీవించాల్సిన కొందరు మాజీ సైనికులు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. డిఫెన్స్ క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకు లభించే మద్యం కోటాను అక్రమ వ్యాపారంగా మలుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భర్తలు బయట నుంచి బాటిళ్లు తీసుకురావడం.. ఇంట్లోనే ఉంటూ భార్యలు వాటిని గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయించడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఆల్వాల్ ప్రాంతంలో రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ దందాపై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టి ఉక్కుపాదం మోపింది. స్టేట్ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల్లో భారీగా అక్రమ డిఫెన్స్ మద్యం పట్టుబడింది.
లోతుకుంటలో 96 బాటిళ్లు స్వాధీనం:
మల్కాజిగిరి ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్‌రావు నేతృత్వంలోని బృందానికి సరస్వతీనగర్, లోతుకుంట ప్రాంతంలో డిఫెన్స్ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో సిబ్బంది స్థానికంగా నివాసముంటున్న మన్యం నాగప్రసన్న, రామాంజనేయులు దంపతుల ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 96 డిఫెన్స్ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ సైనికుడైన రామాంజనేయులు తన కోటాతో పాటు ఇతరుల కోటా కింద క్యాంటీన్ల నుంచి తక్కువ ధరకు మద్యం తెస్తుండగా, అతని భార్య నాగప్రసన్న ఇంట్లోనే ఉంటూ స్థానికులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు, నాగప్రసన్నను అరెస్ట్ చేసి ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
Also Read
- Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
- Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
- Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సెన్సేషన్
- India Head Coach Role: టీమిండియా కోచ్ పదవి అంటే 'ముళ్ల కిరీటమే'..
న్యూ బోయిన్‌పల్లిలో మరో మహిళ అరెస్ట్:
మరో ఘటనలో, ఆల్వాల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని న్యూ బోయిన్పల్లి, సౌజన్య కాలనీలో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సీఐ గణపతిరెడ్డి బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. కాలనీకి చెందిన ముసిమి లెంక (39) అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం అమ్ముతున్న సదరు మహిళను అదుపులోకి తీసుకుని ఆల్వాల్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 163 డిఫెన్స్ మద్యం బాటిళ్లను సీజ్ చేశామని అధికారులు వెల్లడించారు. మార్కెట్లో వీటి విలువ సుమారు రూ. 2.11 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. రక్షణ శాఖ ఇచ్చే వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ అక్రమ విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
-
Ex-Girlfriend Case: మాజీ ప్రేయసి వివరాల కోసం యువకుడి ప్రయత్నం.. 97 RTI దరఖాస్తులు, 1,887 ప్రశ్నలు! షాకైన కమిషన్
-
Panchayat Raj Act : పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. నిధులపై కొత్త రూల్
-
Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
ట్రెండింగ్
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!