Poker Night Busted : దీపావళి వేళ.. పేకాట ఆడుతూ దొరికిన మహిళా వ్యాపారవేత్తలు..
- బంజారాహిల్స్‌లో టాస్క్‌ఫోర్స్ దాడి
- పోకర్ నైట్ పేరుతో జూదం
- 30 మంది అదుపులోకి.. 20 మందికి పైగా మహిళలు
- విదేశీ మద్యం, పోకర్ కాయిన్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని నగరంలోని బంజారాహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడి కలకలం రేపింది. దీపావళి పండుగ హడావుడిలో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న హైప్రొఫైల్ పోకర్ గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ‘దీపావళి పోకర్ నైట్’ పేరుతో నడిపిస్తున్న ఈ పేకాట శిబిరంపై మెరుపు దాడి చేసి, ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏకంగా 20 మందికి పైగా మహిళా వ్యాపారవేత్తలు ఉండటం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
పోకర్ నైట్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా దందా
బంజారాహిల్స్ పరిధిలో గరిమ గనేరివాల్ అనే మహిళా వ్యాపారవేత్త ఎలాంటి బయటి వ్యక్తులకు ప్రవేశం లేకుండా ఈ హైప్రొఫైల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దీపావళి వేడుకల పేరిట ప్రత్యేకంగా పోకర్ నైట్‌ను నిర్వహిస్తూ సంపన్నులను, ప్రముఖ వ్యాపార కుటుంబాలకు చెందిన వారిని ఆకర్షించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఒక్కసారిగా ఈ ఈవెంట్‌పై పడి నిర్వాహకులకు షాక్ ఇచ్చారు. విలాసవంతమైన వాతావరణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ జూద బాగోతం పోలీసుల రైడ్‌తో బయటపడింది.
Also Read
- Paytm Diwali Gift Scam: పేటీఎం పేరుతో రూ.1,000 ఎర.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
- Revanth Reddy Birthday Wishes: వరి నారుతో సీఎం 'రేవంత్ రెడ్డి' చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!
- Telangana PG Medical Seats : తెలంగాణలో పీజీ సీట్ల జాతర.. ఒకేసారి 359 పెంపు
- CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
భారీగా విదేశీ మద్యం, పోకర్ కాయిన్స్ సీజ్
ఈ రైడ్ సందర్భంగా పోలీసులు ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున అక్రమ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మద్యం బాటిళ్లు, ప్లేయింగ్ కార్డ్స్, పోకర్ కాయిన్స్, హుక్కా పాట్స్‌తో పాటు పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈవెంట్లో పాల్గొన్న వారంతా ప్రముఖులే కావడంతో ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆసుపత్రికి తరలింపు.. వైద్య పరీక్షలు పూర్తి
పోలీసుల అదుపులోకి తీసుకున్న 30 మందిని నిబంధనల ప్రకారం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పండుగ సంబరాల ముసుగులో చట్టవిరుద్ధంగా జూదానికి పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, ఇలాంటి హైప్రొఫైల్ క్లబ్‌లపై నిఘా మరింత కఠినతరం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Poker Night Busted : దీపావళి వేళ.. పేకాట ఆడుతూ దొరికిన మహిళా వ్యాపారవేత్తలు..
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
Paytm Diwali Gift Scam: పేటీఎం పేరుతో రూ.1,000 ఎర.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
E20 Petrol Controversy: E20 కాదు.. 420! పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్?.. మోడీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
ట్రెండింగ్
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?