Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్.. ‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newtons 3rd Law: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రేక్షకాదరణ ఉంటుంది. కథ చివరి వరకు ఏమి జరుగుతుందో ఊహించలేని స్క్రీన్‌ప్లే ఉంటే అలాంటి సినిమాలు మరింత ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ ‘న్యూటన్స్ థర్డ్ లా’. అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయింది. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ మాట్లాడుతూ, ఈటీవీ నుంచి పరిచయం చేసిన 15వ డెబ్యూ దర్శకుడి నుంచి వస్తున్న మరో కంటెంట్ ప్రధాన చిత్రమే ‘న్యూటన్స్ 3rd లా’ అని అన్నారు. మంచి కథలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తామనే తమ నమ్మకాన్ని ఈ సినిమా మరోసారి నిలబెడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ, గత పదేళ్లలో తాను సింగిల్ నేరేషన్ విన్న వెంటనే అంగీకరించిన కథలు రెండే రెండని, వాటిలో ఒకటి ‘మళ్లీ రావా’, మరొకటి ‘న్యూటన్స్ 3rd లా’ అని వెల్లడించారు. ‘అనగనగా’ సినిమా చేయకముందే ఈ కథ తనకు వినిపించారని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర కంటే కథను ముందుకు నడిపించే స్క్రీన్‌ప్లేనే అసలు హీరో అని పేర్కొన్నారు. బయటకు చూస్తే ఇది థ్రిల్లర్‌లా కనిపించినా, లోపల బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా కావడంతోనే ఈటీవీ ఈ ప్రాజెక్ట్‌ను వెంటనే ఆమోదించిందన్నారు. ట్రైలర్లో చూపించింది చాలా తక్కువేనని, సినిమాలో ఇంకా ఎన్నో సస్పెన్స్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. సినిమా టైటిల్ మార్చాలని చాలామంది సూచించినప్పటికీ, కథకు ఇదే సరైన పేరు అని తాను పట్టుబట్టి అలాగే ఉంచినట్లు తెలిపారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో అడివి శేష్ కూడా చిత్రబృందానికి తన మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం తాను ‘గూఢచారి 2’ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆ సినిమా గురించి ఈ వేదికపై మాట్లాడడం సరైంది కాదని, ఈ రోజు పూర్తిగా ‘న్యూటన్స్ 3rd లా’ కోసమే వచ్చానని చెప్పారు. వరుస షూటింగ్‌ల మధ్య కూడా ఈ కార్యక్రమానికి రావడం ద్వారా చిత్రబృందంపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమంత్, మరోసారి థ్రిల్లర్ జోనర్‌ను ఎంచుకున్నారు. ఇప్పటికే ‘సుబ్రహ్మణ్యపురం’, ‘కపటధారి’ వంటి చిత్రాలతో ఈ తరహా కథల్లో మెప్పించిన ఆయన, ఈసారి వాసుదేవ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఒక అనుమానాస్పద హత్య కేసు దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుండగా, ట్రైలర్లో చూపించిన ప్రతి సన్నివేశం ఉత్కంఠను మరింత పెంచుతోంది. కేసు విచారణలో ఒక్కో మలుపు ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలకు కట్టిపడేసేలా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ సీనియర్ నటుడు జగపతి బాబు. ఆయన పాత్ర కథకు కీలకంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. సినిమా టైటిల్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ మూడో నియమాన్ని కథతో ఎలా ముడిపెట్టారన్నది ప్రధాన సస్పెన్స్‌గా నిలిచింది. ప్రతి నేరం వెనుక ఒక కారణం, ప్రతి చర్యకు ఒక పరిణామం ఉంటుందనే కాన్సెప్ట్‌తో కథ సాగనున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. కమర్షియల్ అంశాలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో తెలుసుకోవాలంటే జూలై 31 వరకు వేచి చూడాల్సిందే.
- Tags
- cinema
- Newtons 3rd Law
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?